Duranto Express | దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణికుడికి గాయాలు.. కిటికీ అద్దాలు ధ్వంసం
Duranto Express : నాగ్‌పూర్-ముంబై మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌లకు సంబంధించిన కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
Duranto Express : దేశంలో రైళ్లపై రాళ్లతో దాడి చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. నిందితుల్ని గుర్తించి ఎన్నిసార్లు శిక్షించినా కొందరు మారడం లేదు. తాజాగా అలాంటి మరో ఘటన జరిగింది. నాగ్‌పూర్-ముంబై మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌లకు సంబంధించిన కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఒక ప్రయాణికుడు గాయపడ్డాడు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి బోర్ఖేడి-సింది మధ్య జరిగింది. రాళ్ల దాడి తర్వాత వార్దా రైల్వే స్టేషన్లో రైలును అధికారులు నిలిపివేశారు. అరగంటపాటు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. అనంతరం తిరిగి రైలు ముంబై వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి 10.27 గంటలకు దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏ1, బి2, బి5 కోచ్‌లపై దాడి జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బోర్ఖేడి, బ్రహ్మణి గ్రామాల మధ్య పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామ ప్రజల్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్ని, అనుమానితుల్ని పోలీసులు గుర్తించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కదులుతున్న రైలుపై ఎలాంటి రాళ్ల దాడి చేయొద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైలు ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా, రైలు సర్వీసులకు ఆటంకం కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఇలాంటి ఘటనలకు పాల్పడితే రైల్వే యాక్ట్ సెక్షన్ 152, 154 కింద కేసులు బుక్ చేసి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

