లక్నో: అద్దె ఇంట్లో నివసించే వ్యక్తికి చెందిన పిండి డబ్బాలో బాలిక మృతదేహం లభించింది. ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆగ్రహించాడు. దీంతో యజమాని కుమార్తెను అతడు హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో నిందితుడు హతమయ్యాడు. (Girl Body in Flour Drum) ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. తాజ్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ప్రతిజ్ఞ ఒకటో తరగతి చదువుతున్నది.
కాగా, మార్చి 25న ఆ బాలిక అదృశ్యమైంది. ఆమె తండ్రి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేశారు. 29 ఏళ్ల సునీల్ కుమార్ నివసిస్తున్న అద్దె ఇంట్లోని పిండి డబ్బాలో కుక్కిన ఆ చిన్నారి మృతదేహాన్ని బుధవారం రాత్రి వేళ పోలీసులు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
మరోవైపు తమ బిల్డింగ్ మొదటి అంతస్తులోని అద్దె ఇంట్లో సునీల్ రెండేళ్లుగా నివసిస్తున్నట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు చెందిన షూ యూనిట్లో అతడు పని చేస్తున్నట్లు చెప్పారు. తమ కుమార్తెను తరచుగా అతడు బయటకు తీసుకెళ్లేవాడని వెల్లడించారు.
అయితే గత ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటికి తాళం వేసి ఖాళీ చేయాలని సునీల్‌ను డిమాండ్ చేసినట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. బకాయిల కింద రూ. 5,000 చెల్లించిన తర్వాతే గదిని తిరిగి తెరిచినట్లు పోలీసులకు చెప్పారు.
ఈ నేపథ్యంలో కక్షగట్టిన సునీల్, తమ కుమార్తె ప్రతిజ్ఞను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు వెతికారు. చివరకు మార్చి 28న శనివారం పోలీసుల ఎన్కౌంటర్లో సునీల్ హతమయ్యాడు.
కాగా, ఆ బాలికను సునీల్ ఒక్కడే హత్య చేశాడా? లేక ఇతర నిందితులు ఉన్నారా? అన్నది తెలియలేదు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారించకుండానే ఎన్కౌంటర్ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
Agra Horror: 7-Year-Old Girl Murdered, Body Found Inside Drum; Tenant Suspected
In Agra, a 7-year-old girl was brutally murdered, with her body allegedly stuffed inside a small iron drum.
The drum was found in a room rented by a man identified as Sunil.
The suspect is… pic.twitter.com/UPyV6QzKcL
— Atulkrishan (@iAtulKrishan1) March 26, 2026
Also Read:
Army rejects milk powder | నాణ్యతా లోపం.. 125 మెట్రిక్ టన్నుల పాల పొడిని తిరస్కరించిన ఆర్మీ
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్