Man Throws Son Into River | ఫోన్లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని నదిలోకి విసిరేసిన వ్యక్తి
Man Throws Son Into River | పుట్టింట్లో ఉన్న భార్యతో ఒక వ్యక్తి ఫోన్లో గొడవ పడ్డాడు. అయితే భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపించాడు. అతడి వద్ద ఉంటున్న ఆరేళ్ల కొడుకును వంతెన పై నుంచి నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు.
సిమ్లా: పుట్టింట్లో ఉన్న భార్యతో ఒక వ్యక్తి ఫోన్లో గొడవ పడ్డాడు. అయితే భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపించాడు. అతడి వద్ద ఉంటున్న ఆరేళ్ల కొడుకును వంతెన పై నుంచి నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు. (Man Throws Son Into River) హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హితేష్ కుమార్ గత ఏడాది కాలంగా పరేల్‌లోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా అతడు పనిచేస్తున్నాడు. అతడి భార్య గత నెల రోజులుగా చిన్న కుమారుడితో కలిసి అమృత్‌సర్‌లోని పుట్టింట్లో నివసిస్తున్నది. ఆరేళ్ల పెద్ద కుమారుడు గగన్‌దీప్ అతడి వద్ద ఉంటున్నాడు.
కాగా, ఆగస్ట్ 10న రాత్రి వేళ హితేష్ కుమార్ ఫోన్లో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత కుమారుడు గగన్‌దీప్‌ను పరేల్ వంతెన వద్దకు తీసుకెళ్లాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న రావి నదిలోకి ఆ బాలుడ్ని విసిరేశాడు. మంగళవారం తెల్లవారుజామున పోలీస్ హెల్ప్‌లైన్‌కు అతడు ఫోన్ చేశాడు. తన కుమారుడ్ని నదిలోకి విసిరేసినట్లు చెప్పాడు.
మరోవైపు పోలీసులు తొలుత హితేష్ మాటలను నమ్మలేదు. అయితే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అతడు నివసిస్తున్న అద్దె ఇంట్లో ఆ బాలుడు కనిపించకపోవడంతో కుమారుడ్ని అతడు నదిలోకి విసిరేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలుడి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ పిల్లవాడి మృతదేహం ఇంకా లభించలేదు.
నిందితుడైన హితేష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి భార్య మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కుమారుడ్ని నదిలోకి విసిరేసే ముందు ఆ దంపతుల మధ్య ఏం గొడవ జరిగింది అన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

