Horoscope | 18-09-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
వృషభం
ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.
మిథునం
అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
కర్కాటకం
స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహం
అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
కన్య
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
తుల
ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
ధనుస్సు
నూతన వ్యక్తులు పరిచయమవుతారు. పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది.
మకరం
విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
కుంభం
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్యబాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

