Ishika Chaudhary : మహిళల హాకీ వరల్డ్‌కప్ సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో మెగా ఈవెంట్ మొదలవ్వనుంది. ఈసారి టైటిల్ లక్ష్యంగా చెలరేగాలనుకుంటున్న భారత జట్టుకు ఫిఫా వరల్డ్‌కప్ స్ఫూర్తి అంటోంది డిఫెండర్ ఇషికా చౌదరీ(Ishika Chaudhary). ఇటీవలే అమెరికాలో ముగిసిన సాకర్ వేడుక.. ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకూడదని స్పష్టం చేసిందని పేర్కొన్న ఇషిక టీమిండియా కూడా అద్భుతాలు చేస్తుందని చెప్పింది.
ఫేవరెట్ల జట్లకు చిన్న టీమ్‌లు షాకివ్వడం ప్రతి ఆటలో చూస్తుంటాం. ఇటీవలే ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అనామక జట్టైన కేప్ వెర్డే చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తృటిలో ఓటమి తప్పించుకుంది. ఆద్యంతం సంచలనాలతో రసవత్తరంగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్పే ఇప్పుడు హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రేరణ కానుంది.
‘ఫిఫా వరల్డ్‌కప్‌తో ఏ జట్టు అవకాశాలను కొట్టిపారేయలేం అని మరోసారి నిరూపితమైంది. నాలుగేళ్లకోసారి జరిగే హాకీ ప్రపంచకప్‌లోనూ ఏదైనా సాధ్యమే. ఫిఫా స్ఫూర్తితో మేము చెలరేగుతాం’ అని డిఫెండర్ ఇషికా చౌదరీ వెల్లడించింది. అన్నట్టు.. తనకు ఇదే మొట్టమొదటి హాకీ వరల్డ్‌కప్.
India Hockey’s at Hockey World Cup🏑🇮🇳
From legendary caps to the youngest players, these numbers tell a story of experience and the next generation.
🇮🇳 Manpreet Singh – 417 caps
🇮🇳 Savita Punia – 313 caps
⭐ Aditya Arjun – 13 caps & youngest player
⭐ Shilpi Dabas &… pic.twitter.com/IaO5yYzsFR— IndiaSportsHub (@IndiaSportsHub) August 13, 2026
మహిళల హాకీ వరల్డ్‌కప్ పోటీలకు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఆగస్టు15న మొదలవ్వనుంది. 16 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో విజేత ఎవరో ఆగస్టు 30న తెలియనుంది. గ్రూప్ డీలోని భారత జట్టు లీగ్ దశలో చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను ఢీకొట్టనుంది. ఆగస్టు 16న చైనాతో, ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో, ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.