బీట్ ఆఫీసర్ మృతి ఘటనపై అటవీ శాఖ సీరియస్
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని... ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. గురువారం చెరువు సింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీప్రాంతాన్ని..
– అక్రమ విద్యుత్ ఉచ్చుల మూలాలపై సమగ్ర దర్యాప్తు
– వందేళ్లలో ఇలాంటి సంఘటనా ఎక్కడా జరగలేదు
– డీఎఫ్ఓ సిద్ధార్ద్ విక్రమ్ సింగ్
బూర్గంపహాడ్, ఆగస్టు 13 : వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని… ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. గురువారం చెరువు సింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీప్రాంతాన్ని ఆయన అటవీ అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ సిబ్బంది ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ముసలిమడుగు సెక్షన్ పరిధిలో చెరువుసింగారం బీట్ లో సంఘటనా స్థలంలో అణువణువునా పరిశీలించారు. అక్రమ విద్యుత్ ఉచ్చు ఏర్పాటు చేసిన ప్రాంతం, విద్యుత్ సరఫరా జరిగిన విధానం, సంబంధిత విద్యుత్ లైన్లు, అక్రమంగా విద్యుత్ తీసుకున్న మార్గం, పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటన కేవలం వన్యప్రాణుల వేటకు సంబంధించిన నేరంగా మాత్రమే కాకుండా ప్రాణాంతకమైన అక్రమ విద్యుత్ వినియోగం, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ భద్రత, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ, అంతరశాఖల సమన్వయానికి సంబంధించిన అంశంగా పరిగణించారు.
అక్రమ విద్యుత్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ విద్యుత్ లైన్ నుంచి సరఫరా జరిగింది, ఎలాంటి విధానంలో విద్యుత్‌ను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు, అక్రమ కనెక్షన్ ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఫీల్డ్ సిబ్బందికి ఎప్పుడైనా సమాచారం అందిందా, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై అవసరమైన పర్యవేక్షణ తనిఖీలు జరిగాయా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అక్రమ విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు, వారికి విద్యుత్ సరఫరా ఎలా అందింది, ఈ చర్య వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నేరానికి పాల్పడిన వ్యక్తులపై వర్తించే అటవీ, వన్యప్రాణి సంరక్షణ, విద్యుత్, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, విధుల్లోకి అటవీ సిబ్బంది వెళితే ప్రత్యేక చర్యలతో పాటు అప్రమత్తత పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదేమైనా విధుల్లో ఎఫ్బీఓ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన వెంట ఎఫ్ఎవో కృష్ణప్రసాద్, డీఆర్వోలు అనార్కలీ, క్రాంతి, ఎస్ఆర్వో సురేష్, ఎస్ఐ రామ్మూర్తి, విద్యుత్ శాఖ అధికారులు, ముసలిమడుగు సెక్షన్ బీట్ ఆఫీసర్లు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

