పనాజీ: ఒక పర్యాటకుడు బీచ్లో పారాసైలింగ్ చేస్తున్నాడు. అతడు గాలిలో ఉండగా పారాసైలింగ్, బోటు మధ్య ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ పర్యాటకుడు సముద్రంలో పడిపోయాడు. (Parasailing Cable Snap) ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం గోవాలోని బాగా బీచ్లో బోటుకు కట్టిన తాడు సహాయంతో ఒక టూరిస్ట్ పారాసైలింగ్ చేశాడు.
కాగా, పారాసైలింగ్, బోటు మధ్య అనుసంధానంగా ఉన్న తాడు తెగిపోయింది. దీంతో పారాసైలింగ్ చేస్తున్న వ్యక్తి సముద్రంలో పడిపోయాడు. ఇది చూసి అతడికి చెందిన వారు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. ఆ పర్యాటకుడిని సకాలంలో రక్షించారు. అయితే సాహస కార్యకలాపాల్లో భద్రత పట్ల ఈ సంఘటన ఆందోళన రేకెత్తించింది. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Repeat with me – Never Ever do any adventure activity in India.
Yesterday while doing parasailing in Goa, a cable got snapped. pic.twitter.com/ZYAY3zWo04
— Suraj Kumar Talreja (@suritalreja) March 30, 2026
Also Read:
Woman Kills Husband | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. పిల్లలతో కలిసి మృతదేహం పక్కన నిద్ర
Man Dupes High Court Judge | హైకోర్టు న్యాయమూర్తిని ఆరు లక్షలకు మోసగించిన వ్యక్తి.. అరెస్ట్
Watch: రాత్రివేళ ఇంటి గోడలు దూకి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి