లక్నో: ఒక మహిళ తన ప్రియుడైన బావతో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం పక్కన ఉన్న మంచంపై పిల్లలతో కలిసి నిద్రించింది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. కోడలుపై మామ అనుమానించడంతో అసలు గుట్టు రట్టయ్యింది. (Woman Kills Husband) ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిప్లావతి కాలా గ్రామానికి చెందిన మెహరాజ్, తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అతడి భార్య రూహి, సోదరి భర్త అయిన బావ ఫర్మాన్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.
కాగా, వీరిద్దరి మధ్య సంబంధం గురించి మెహరాజ్కు తెలిసింది. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించేందుకు భార్య రూహి కుట్ర పన్నింది. మెహరాజ్ ఆహారంలో మత్తు మందు కలిపింది. ఆ రాత్రివేళ ఫర్మాన్, అతడి స్నేహితుడు అద్నాన్ ఆ ఇంటికి చేరుకున్నారు. మెహరాజ్ కాళ్లను తాడుతో కట్టేశారు. ముగ్గురూ కలిసి పదునైన కత్తితో అతడి గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత రూహి తన భర్త మృతదేహం పక్కనే ఉన్న మంచంపై పిల్లలతో కలిసి రాత్రంతా నిద్రించింది.
మరోవైపు మరునాడు ఉదయం మెహరాజ్ తండ్రి ఆ ఇంటికి వచ్చాడు. వరండాలోని మంచంపై కొడుకు మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు. అతడి కాళ్లు కట్టేసి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. గత రాత్రి తమ ఇంట్లో దోపిడీ జరిగిందని, దొంగలు మెహరాజ్ కాళ్లు కట్టేసి హత్య చేశారని రూహి కట్టుకథ అల్లింది.
అయితే కోడలిని అనుమానించిన మామ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రూహిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రియుడు ఫర్మాన్, అతడి స్నేహితుడు అద్నాన్తో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులైన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Dupes High Court Judge | హైకోర్టు న్యాయమూర్తిని ఆరు లక్షలకు మోసగించిన వ్యక్తి.. అరెస్ట్
Watch: రాత్రివేళ ఇంటి గోడలు దూకి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి