న్యూఢిల్లీ: ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ముగింపు అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనలు అధికారికంగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి.
నిరసనల్లో పాల్గొన్న కొందరిని గుర్తుపట్టి, బహిరంగ ప్రదేశాలలో వేధించడం, దాడులకు పాల్పడటం తదితర ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో కొందరు వ్యక్తులు ప్రదర్శనకారులను చుట్టుముట్టి, బూతులు తిడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి.