మెట్పల్లి రూరల్, జూలై 28 : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి క రెంటు సరిగా ఉంటలేదని మెట్పల్లి మండ లం వెల్లుల్ల కాంగ్రెస్ సర్పంచ్ గూడూరు తిరుపతి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మె ట్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మండల, గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల సమీక్షను అధికారులు చదివి వినిపించారు.
అధికార పార్టీకి చెందిన వెల్లుల్ల సర్పంచ్ తిరుపతి విద్యుత్తు సమస్యపై గళమెత్తారు. రేవంత్అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామా ల్లో విద్యుత్ సమస్య తలెత్తిందని మండిపడ్డారు. మెట్లచిట్టాపూర్ ఇందిరమ్మ కాలనీ లో ఉన్న ఏబీ కేబుల్ స్థానంలో ఓపెన్వైర్ వేయాలని సర్పంచ్ ఎస్ అరుణ కోరారు.