ఇంటర్నల్స్ అయ్యాక.. దోస్త్ స్పాట్ అడ్మిషన్లు
డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలయ్యింది. కాస్త ఆలస్యంగా ఈ షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. సిటీ కాలేజీ సహా పలు అటానమస్ కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్ మొదటి ఇంటర్నల్స్ పూర్తయ్యాయి. రెండో ఇంటర్నల్స్ కూడా సమీపిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో జూలైలో, మరికొన్ని కాలేజీల్లో ఆగస్టులో క్లాసులు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలయ్యింది. కాస్త ఆలస్యంగా ఈ షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. సిటీ కాలేజీ సహా పలు అటానమస్ కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్ మొదటి ఇంటర్నల్స్ పూర్తయ్యాయి. రెండో ఇంటర్నల్స్ కూడా సమీపిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో జూలైలో, మరికొన్ని కాలేజీల్లో ఆగస్టులో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఆలస్యంగా దోస్త్ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి ఏటా ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడం కాకుండా.. జీవో జారీచేస్తే సరిపోతుందని డిగ్రీ అధ్యాపకుల సంఘం నేతలంటున్నారు. స్పాట్ సీట్ల భర్తీలో భాగంగా ఖాళీ సీట్ల వివరాలను బుధవారం విడుదల చేస్తామని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో అడ్మిషన్లు పూర్తిచేయాలని.. ఈ నెల 26న భర్తీ అయిన సీట్ల వివరాలు కాలేజీలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. వన్‌టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్లకు 28, 29 తేదీల్లో అవకాశం కల్పించామని.. 30న భర్తీ అయిన సీట్ల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

