Madhapur | ఒయోలో యువతి మృతి కేసు.. గదిలో పగిలిన బీర్, విస్కీ బాటిళ్ల గుర్తింపు..!
Madhapur : మాధాపూర్‌లోని ఓయో రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి షారన్ నిఖిత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Madhapur : మాధాపూర్‌లోని ఓయో రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి షారన్ నిఖిత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడు రవితేజతో వచ్చిన నిఖిత అనూహ్యంగా మరణించడంపై సందేహాలు వ్యక్తమైనందున విచారణ చేపట్టగా.. ఓయో రూమ్‌లో పగిలినబీర్, విస్కీ బాటిల్స్ గుర్తించారు పోలీసులు. అంతేకాదు బెడ్‌తో పాటు గది గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి. మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సోమవారం మధ్యాహ్నం 1:48 గంటలకు నిఖిత ఓయో హోటల్‌కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజ హోటల్‌కు వచ్చాడు. అయితే.. అర్ధరాత్రి నిఖిత స్పృహ కోల్పోయిందంటూ రవితేజ తన వద్దకు వచ్చాడని హోటల్ సూపర్వైజర్ పోలీసులకు తెలిపాడు. అప్పుడు అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్దామని సూచించగా.. రవితేత వద్దు, బైక్ చాలని నిఖితను ఆసుపత్రికి తీసుకెళ్లాడని అతడు చెప్పాడు. కానీ, ఆస్పత్రికి వెళ్లాక నిఖిత మృతి చెందిందని డాక్టర్లు చెప్పడంతో, అక్కడి నుంచి రవితేజ పరారయ్యాడు. ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు వ్యత్యాసం ఉందని, అబ్బాయి కంటే అమ్మాయే పెద్దదని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న రవితేజ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

