ILT20 Auction : ఇంటర్నేషనల్ టీ20 లీగ్ వేలానికి సమయం దగ్గరపడింది. అక్టోబర్ 1వ తేదీన దుబాయ్‌లో ఆక్షన్ జరుగనుంది. ఐసీసీ అకాడమీ ఇండోర్ ఫెసిలిటీలో నిర్వహించనున్న వేలంలో 20 దేశాలకు చెందిన ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే.. ఈసారి ఎనిమిది వందలకు పైగా క్రికెటర్లు రిజిష్టరవ్వగా.. వడబోత అనంతరం రెండొందల మంది మాత్రమే వేలంలో నిలిచారని నిర్వాహకులు వెల్లడించారు.
దుబాయ్ వేదికగా ఐఎల్టీ20 వేలం జరుగుంది. అక్టోబర్ 1వ తేదీన అక్కడి ఐసీసీ అకాడమీ ఇండోర్ ఫెసిలిటీలో ఆక్షన్ ఉండనుంది. వేలానికి మరో తొమ్మిది రోజులే ఉండడంతో.. ప్రతి ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బుంది? ఎంత మంది క్రికెటర్లు వేలంలో ఉన్నారు? ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయి? అనేవి కీలకంగా మారాయి. ఈసారి ప్రతి ఫ్రాంచైజీ 13 లక్షల అమెరికన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో రూ.12.42 కోట్లు) ఖర్చు చేయనుంది. అయితే.. రిటెన్షన్‌కు దాదాపు రూర.6 కోట్లు పోగా.. మిగతా ఆరు కోట్లలో అవసరమై ఆటగాళ్లను కొనేందుకు సిద్ధమవుతున్నాయి ఫ్రాంచైజీలు.
The ILT20 auction will be held in Dubai on October 1 at the ICC Academy. pic.twitter.com/EGPgMOQZaU
— Cricbuzz (@cricbuzz) September 22, 2026
ఐఎల్టీ20 సీజన్ 2026 వేలం కోసం క్రికెటర్లు జులై – సెప్టెంబర్ మధ్య పేర్లు నమోదు చేసుకున్నారు. వేలం అనంతరం ప్రతి జట్టులో కనీసం 18 మంది.. గరిష్టంగా 23 మంది ప్లేయర్లు ఉండాలి. ఇందులో.. ఐసీసీ పూర్తి సభ్యదేశాల నుంచి కనీసం 11 మంది(అఫ్గనిస్థాన్ నుంచి కనీసం నలుగురు, ఐర్లాండ్ నుంచి ఒకరు) ఉండాలని, యూఏఈ నుంచి నలుగురు, కువైట్ నుంచి ఒకరు, సౌదీ అరేబియా నుంచి ఒకరు, ఐసీసీ అనుబంధ దేశాలైన యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా నుంచి ఒకరిని తీసుకోవాలని ఐఎల్టీ20 నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆటగాళ్ల అందరి కనీస ధర విషయానికొస్తే.. రూ.9.55 ఉండాలి. అయితే.. కొందరి ధర రూ.38 లక్షల నుంచి రూ.76 లక్షలు ఉండే అవకాశముంది.