గబ్బిలాలతో ప్రకృతి సమతుల్యత
గబ్బిలాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఉస్మాని యా విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాసులు తెలిపారు. కరోనా అ నంతరం గబ్బిలాలపై 2021-2022లో ము గ్గురు శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపినట్టు ఆయన వెల్లడించారు.
- ప్రపంచంలోనే తొలిసారి గబ్బిలాల ఆహారంపై అధ్యయనం చేసిన డీఎన్ఏ శాస్త్రవేత్తలు
- డెంగ్యూ, మలేరియా దోమలు, తెగుళ్లను అరికడుతూ మానవాళికి మేలు చేస్తున్న గబ్బిలాలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడి
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : గబ్బిలాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఉస్మాని యా విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాసులు తెలిపారు. కరోనా అ నంతరం గబ్బిలాలపై 2021-2022లో ము గ్గురు శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపినట్టు ఆయన వెల్లడించారు. గబ్బిలాలు రాత్రిపూట సంచరించే జీవులే కాదని, ప్రకృతి సమతుల్యతను కాపాడే ‘సూపర్ హీరోలు’ అని వారి అధ్యయన నివేదిక కొనియాడింది. దేశంలోనే తొలిసారిగా డీఎన్ఏ మెటబార్ కోడింగ్ సాంకేతికతను ఉపయోగించి గబ్బిలాల ఆహారపు అలవాట్లను విశ్లేషించారు. అ వి వేల రకాల కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నట్టు వెల్లడైంది. ప్రొఫెసర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో డాక్టర్ భార్గవి, డాక్టర్ ఆదిత్య జరిపిన ఈ అధ్యయనం ఫలితాలు జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సాలో ప్రచురితమయ్యాయి.
ఆహార భద్రతకు కీలకం
గబ్బిలాలు ప్రజల ఆహార భద్రతకు కీలకమని డాక్టర్ భార్గవి పేర్కొన్నారు. అవి తెగు ళ్లు, వ్యాధులను వ్యాప్తి చేసే కీటకాలనే లక్ష్యం గా చేసుకొంటాయని వివరించారు. ఈ అధ్యయనం జీవవైవిధ్య పరిశోధనలకు కొత్త మా ర్గం చూపుతుందని అన్నారు. గబ్బిలాలు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు అత్యం త అవసరమని, ముఖ్యంగా ఒకే గుహలో జీవిస్తున్న కోలార్ రౌండ్‌లీఫ్ బ్యాట్ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవస రం ఉందని ప్రొఫెసర్ శ్రీనివాసులు సూచించారు. ఈ గబ్బిలాలు డెంగీ, మలేరియా వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను, టమాటా పంటలను దెబ్బతీసే లీఫ్ మైనర్ చిమ్మటల ను, బ్యాక్టీరియా, వైరస్‌లను మోసే ఇతర హా నికర కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. దీంతో గబ్బిలాలు సహజసిద్ధంగా తెగుళ్ల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, రైతులకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

