Minister Surekha : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తరచూ సంచలన వ్యాఖ్యలతో నిలుస్తుంటారు. సొంత పార్టీ నేతలపైన విమర్శనాస్త్రాలు సంధించే సురేఖ.. ఈసారి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరికల సందర్భంగా మాట్లాడిన మంత్రి ‘కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ల నీడను కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంది.. వాళ్లు పని చేయరు ఇంకొకరిని చేయనివ్వరు’ అని రేవూరి ప్రకాశ్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీరును తప్పుపట్టిన మంత్రి సురేఖ.. ఆయనతో అటు పార్టీకి, ఇటు ప్రజలకు నష్టమని అన్నారు. ‘పని చేయని ఎమ్మెల్యేలు.. ఇంకొకరికి అడ్డుపడే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లబుద్ది కాదు. నిజం చెప్పాలంటే.. అలాంటి వాళ్ల కారణంగా పార్టీ నష్టపోతుంది..ప్రజలు కూడా నష్టపోతారు’ అని మంత్రి కొండా సురేఖ ఘాటుగానే పరకాల ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ల నీడను కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంది.. వాళ్ళు పని చేయరు ఇంకొకరిని చేయనివ్వరు
దాని వల్ల మనకి వాళ్ల దగ్గరకి వెళ్ళబుద్ది కాదు
వాళ్ల వల్ల పార్టీ నష్టపోతుంది..… pic.twitter.com/8UKvoh9khM
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026