న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను (Delhi LG VK Saxena) నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపణలు నిరూపించడంలో ఫిర్యాదుదారు విఫలమైనట్లు సాకేత్ కోర్టు పేర్కొంది. 25 ఏళ్ల నాటి కేసును ముగించింది. 2000లో అహ్మదాబాద్‌కు చెందిన ‘కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవో సంస్థ అధిపతిగా వీకే సక్సేనా ఉన్నారు. ‘నర్మదా బచావో ఆందోళన్’కు వ్యతిరేకంగా ఆయన ప్రకటనలు ప్రచురించినట్లు మేధా పాట్కర్ ఆరోపించారు. వీకే సక్సేనాపై పరుపునష్టం దావా వేశారు.
కాగా, 2025 మార్చిలో ఈ కేసులో అదనపు సాక్షులను విచారించాలన్న మేధా పాట్కర్ దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను నిర్దోషిగా ప్రకటించింది. ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ గురువారం ఈ తీర్పు ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు 2001లో మేధా పాట్కర్‌పై కూడా వీకే సక్సేనా రెండు పరువునష్టం కేసులు దాఖలు చేశారు. ఒక టీవీ ఛానెల్లో తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి తన పరువుకు నష్టం కలిగించినట్లు ఆరోపించారు. ఈ కేసులో మేధా పాట్కర్‌ను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు గత వారం ప్రకటించింది.
Also Read:
Sadhvi Prem Baisa | సాధ్వి అనుమానాస్పద మృతి.. సోషల్ మీడియా పోస్ట్‌పై పలు సందేహాలు
Woman Commando Murdered | గర్భిణీ మహిళా కమాండోను.. దారుణంగా హత్య చేసిన భర్త
Watch: మహిళను దారుణంగా కొట్టి.. లైంగికంగా వేధించిన బీజేపీ నేత
Watch: లోయలోకి దూసుకెళ్లబోయిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం