భోపాల్: ఒక బీజేపీ నేత మహిళను దారుణంగా కొట్టాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. (BJP Leader Assaults Woman) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 25 ఏళ్ల మహిళ బ్యూటీ పార్లర్ షాపు నిర్వహిస్తున్నది. ఆమె షాపు పక్కనే బీజేపీ నగోడ్ మండల అధ్యక్షుడు పుల్కిత్ టాండన్‌కు చెందిన గోడౌన్ ఉన్నది.
కాగా, జనవరి 27న రాత్రి పది గంటల సమయంలో బీజేపీ నేత పుల్కిత్ వేర్‌హౌస్‌లో పని చేసే ఆర్కే నామ్‌దేవ్ ఆ మహిళకు ఫోన్ చేశాడు. పార్లర్ సర్వీస్ కోసం ఒక కస్టమర్ వచ్చినట్లు చెప్పాడు. ఆమె అక్కడకు వెళ్లగా వేర్‌హౌస్ లోపల ఉన్న బీజేపీ నేత పుల్కిత్ వద్దకు నామ్‌దేవ్ తీసుకెళ్లాడు.
మరోవైపు మద్యం మత్తులో ఉన్న బీజేపీ నేత పుల్కిత్ తన చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆ మహిళ ఆరోపించింది. తాను అక్కడి నుంచి వెళ్తుండగా అడ్డుకున్నాడని, చెంపలపై కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అరుపులు విని సమీపంలోని ఇంటిలో నివసించే తల్లి, సోదరుడు అక్కడకు రాగా వారిపై కూడా పుల్కిత్ దాడి చేసినట్లు పేర్కొంది. ఫిర్యాదు చేస్తే తమను చంపుతామని ఆ బీజేపీ నేత బెదిరించినట్లు తల్లి, సోదరుడితో కలిసి ఫిర్యాదు చేసింది.
అయితే బీజేపీ నేత పుల్కిత్ టాండన్ ఆ మహిళను దారుణంగా కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పుల్కిత్తోపాటు నామ్దేవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాకాంత్ గౌతమ్ స్పందించారు. వివరణ కోరుతూ పుల్కిత్ టాండన్‌కు షో కాజ్ నోటీసు జారీ చేశారు.
Barbarism?
Madhya Pradesh. Watch this video from Nagod
In the video the person is allegedly BJP’s Mandal President Pulkit Tandon is seen chasing and brutally beating a woman. The woman falls onto a pile of iron rods, but the beating continuespic.twitter.com/n03attz5F2— Jude David (@judedavid21) January 28, 2026
Also Read:
Woman Commando Murdered | గర్భిణీ మహిళా కమాండోను.. దారుణంగా హత్య చేసిన భర్త
Couple Jump From Pizza Shop | పిజ్జా షాపులో జంట.. హిందూ సంస్థ సభ్యులు రావడంతో ఏం చేశారంటే?
Watch: వృద్ధుడిని కొమ్ములతో ఎత్తి పడేసిన ఎద్దు.. తర్వాత ఏం జరిగిందంటే?