Kitchen Gardening | కిచెన్ గార్డెనింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం.. రైతులకు శిక్షణా కార్యక్రమం
Kitchen Gardening | కిచెన్ గార్డెనింగ్ అనేది ఇంటి వద్ద చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే పద్ధతి. ఈ విధానం ద్వారా కుటుంబానికి తాజా, రసాయనాలు లేని పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుంది.
Kitchen Gardening | రాయపోల్, మార్చి 10 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని కిచెన్ గార్డెనింగ్పై రామారం గ్రామంలో లో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిధిగా హాజరైన ఎడీఏ బాబు నాయక్ కిచెన్ గార్డెనింగ్ గురించి వివరించారు.
కిచెన్ గార్డెనింగ్ అనేది ఇంటి వద్ద చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే పద్ధతి. ఈ విధానం ద్వారా కుటుంబానికి తాజా, రసాయనాలు లేని పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుంది. ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో కిచెన్ గార్డెనింగ్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రదేశం, పైకప్పు (టెర్రస్), బాల్కనీ లేదా చిన్న తోటలో కూడా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయవచ్చు.
టమాటా, వంకాయ, మిరప, బెండకాయ, దోసకాయ, కాకరకాయ వంటి కూరగాయలతో పాటు మెంతి, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను సులభంగా పెంచవచ్చు. అలాగే కరివేపాకు, పుదీనా, అల్లం వంటి అవసరమైన మొక్కలను కూడా పెంచుకోవచ్చు.
కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి ప్లాస్టిక్ కుండలు, సిమెంట్ కుండలు, గ్రో బ్యాగ్స్ లేదా పాత డబ్బాలు ఉపయోగించవచ్చు. మట్టిలో సేంద్రీయ ఎరువులు (కంపోస్ట్, వెర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు) కలిపి మొక్కలు నాటాలి. మొక్కలకు ప్రతిరోజూ తగినంత నీరు ఇవ్వాలి. అలాగే కీటకాలను నియంత్రించడానికి సహజ ద్రావణాలు లేదా జీవామృతం వంటి సేంద్రీయ పద్ధతులను ఉపయోగించడం మంచిది. కిచెన్ గార్డెనింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటి అవసరాలకు సరిపడా తాజా కూరగాయలు లభిస్తాయి. మార్కెట్లో కొనుగోలు చేసే ఖర్చు తగ్గుతుంది.
రసాయనాలు లేకుండా పండించిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. అలాగే ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకోవచ్చు.
అందువల్ల ప్రతి ఇంట్లో చిన్న స్థాయిలో అయినా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వామి గారు ,BTM ఆశ్లేష, AEO ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.

Read Also :
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్‌లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

