భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 10 : ప్రజా పాలన ప్రగతి పరిపాలన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కత్తి పట్టి కంపచెట్లు, చెత్తను తొలగించారు. మంగళవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం ఐడీఓసీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ స్వయంగా పాల్గొని కార్యాలయ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగిస్తూ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్