SI Arrest | మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై అరెస్ట్..!
SI Arrest : ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
SI Arrest : సమాజానికి, బాధితులకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ దారి తప్పాడు. ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అతడు ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు పోలీసుల చేతిలోనే అరెస్టయ్యాడు ఎస్సై కదిరే శ్రీకాంత్ (38). నిందితుడు శ్రీకాంత్‌ను కోర్టులో హాజరు పరిచగా న్యాయమూర్తి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు.
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై)గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం. వివాహితుడైన అతడు 2014 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. 2025 సంవత్సరంలో ఓ మహిళతో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న శ్రీకాంత్, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకొని, వరంగల్‌లోని ఆమె నివాసానికి వెళ్లి పలుమార్లు శారీరకంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి నగ్న చిత్రాలు తన వద్ద ఉన్నాయని, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఎస్సై శ్రీకాంత్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు శుక్రవారం శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. ఇదివరకు హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని కూడా ఇలానే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీకాంత్ ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడు. ఆ యువతి ఫిర్యాదుతో అతడిపై జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

