Peddi Sudarshan Reddy : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) పార్థీవ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులు నివాళులు అర్పించారు. పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లిన కేటీఆర్, హరీశ్ అక్కడ ఆయన కుటుంబ సభ్యులు, అశేష అభిమానుల సమక్షంలో కన్నీటి వీడ్కోలు పలికారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్ రావులు కంటతడి పెట్టుకున్నారు. తెలంగాన మలిదశ ఉద్యమంలో పెద్దితో కలిసి పోరాడిన రోజులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలిసి ఆయనతో పనిచేసిన రోజులను తలచుకున్నారు. వరంగల్ నుంచి నల్లబెల్లి వరకూ భారీ జనసందోహం నడుమ ఓ ర్యాలీలా సాగిన పెద్ది అంతిమయాత్రలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్.. నల్లబెల్లిలో పెద్ది పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి కేటీఆర్ పెద్ది శవ పేటికపై బీఆర్ఎస్ జెండాను కప్పారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్, హరీష్ రావు https://t.co/P8hS77jrwT pic.twitter.com/8goGj2AY14
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026