King Movie | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. నెట్టింట వైరల్!
ShahRukhKhan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి.
King Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో, సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్‌కు సంబంధించిన స్టిల్స్ లీక్ కావడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘కింగ్’ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా, ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ మరియు కార్ ఛేజ్ సన్నివేశాల తాలూకు ఫొటోలు, అలాగే షారుఖ్ ఖాన్ రగ్గడ్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి.
సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో ఇలా వరుసగా సెట్ ఫొటోలు బయటకు రావడం పట్ల చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుంటే, ఇలాంటి లీక్స్ వల్ల సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయని ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వరకు ఆ ఫొటోలను షేర్ చేయవద్దని మేకర్స్ సోషల్ మీడియా యూజర్లను కోరుతున్నారు.
#KING LEAK #ShahRukhKhan New salt & pepper look🥵🥵🥵🥵🥵 pic.twitter.com/HH5N4yODT9
— clip_tweets (@ClipTweets10) September 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

