Terror Attack | అమర్నాథ్ యాత్ర వేళ ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..!
Terror Attack : పవిత్రమైన అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలోనే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం సాయంత్ర ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఒక వలస కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.
Terror Attack : పవిత్రమైన అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలోనే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. కుల్గుం జిల్లాలోని కెల్లాం గ్రామంలో ఇద్దరు వలస కూలీలపై ముష్కరులు తుపాకులు ఎక్కుపెట్టారు. శుక్రవారం సాయంత్ర ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొక కూలీ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
పది రోజుల వ్యవధిలోనే రెండోసారి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులతో కలలకం సృష్టించారు. ఈసారి వీరి తూటాలకు ఒక వలస కూలీ బలయ్యాడు. కుల్గుం జిల్లాలోని కెల్లాం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు వలస కూలీలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దీపక్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Big News 🇮🇳
A terrorist opened fire on two non-local workers in Kulgam. Both workers were killed.
It’s a Targeted Terror Attack in Kulgam, Jammu and Kashmir.
Video 📷 pic.twitter.com/KFgg5ZExcH
— Brics India (@BRICS_live) July 31, 2026
గాయపడిన మరో కూలీ భూపేందర్కు తీవ్ర గాయాలయ్యాయని, అతడి పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. పది రోజుల్లో ఇది రెండో దాడి. అనంత్నాగ్లో ఉగ్ర కాల్పుల్లో ఒక పోలీస్ మరణించాడు. తాజాగా ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 3000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

