– ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, మార్చి 10 : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో పశువైద్య & పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల ఆర్థికాభివృద్ధికి పశు సంపద, పశువుల ఆరోగ్యం అత్యంత కీలకమని అన్నారు. పశువులకు టీకాలు వేయించడం ద్వారా వ్యాధులను ముందుగానే నివారించి, పశు సంపదను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాడి రైతులు పాల్గొన్నారు.

‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’