నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందిన స్పై డ్రామా ‘చైనా పీస్’. ఈ సినిమా టైటిల్‌ని ‘సీక్రెట్ సోల్జర్స్’గా మార్చారు. అక్కి విశ్వనాథరెడ్డి దర్శకుడు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నది. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే అంశాలతో ఈ సినిమా రూపొందిందని, సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్‌ని జారీ చేసిందని మేకర్స్ తెలిపారు. హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ గరుతు, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్.