లక్నో: ఒక యువ జంట పిజ్జా షాపులో కూర్చొన్నది. ఇంతలో హిందూ సంస్థ సభ్యులు అక్కడకు వచ్చారు. యువతీ, యువకుడిని వారు ప్రశ్నించారు. ఆందోళన చెందిన ఆ జంట రెండో అంతస్తులో ఉన్న పిజ్జా షాపు నుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడ్డారు. (Couple Jump From Pizza Shop) ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి శనివారం సాయంత్రం బరేలీ మోర్ సమీపంలోని పిజ్జా షాప్‌నకు వెళ్లారు. నూడుల్స్ ఆర్డర్ ఇచ్చారు.
కాగా, ఆర్డర్ కోసం ఆ జంట వేచి ఉండగా హిందూ సంస్థ సభ్యులు అక్కడకు వచ్చారు. వారిద్దరి వివరాలు, మతం, కులం గురించి అడిగారు. తాము హిందువులమేనని ఆ జంట చెప్పింది.
మరోవైపు కొందరు వ్యక్తులు వీడియో రికార్డ్ చేస్తుండటంతో ఆ జంట ఆందోళన చెందింది. దీంతో రెండో అంతస్తులోని పిజ్జా షాపు కిటికీ నుంచి యువకుడు కిందకు దూకాడు. ఇది చూసి ఆ యువతి కూడా దూకింది. వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వివరాలు సేకరించారు. అయితే ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
A shocking incident was reported from #UttarPradesh’s #Shahjahanpur district, where a couple allegedly jumped from the first floor of a two-storey pizza shop after members of a #Hindutva group stormed the premises, questioned them, and began recording videos.
The incident was… https://t.co/WMuD8vBgVL pic.twitter.com/w61cNYALKX
— Hate Detector 🔍 (@HateDetectors) January 25, 2026
Also Read:
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
Professor Stabbed At Station | రైల్వే స్టేషన్లో.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు