భువనేశ్వర్: ఒక వ్యక్తి, పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. ఈ నేపథ్యంలో అతడు దానితో పోరాడాడు. కత్తితో పొడిచి చిరుతను చంపాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Man Killed Attacked Leopard) ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నర్సింగ్‌పూర్ వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గ్రామంలో ఒక ఫామ్‌హౌస్ ఉన్నది. శుక్రవారం రాత్రి ఒక చిరుత అందులోకి ప్రవేశించింది.
కాగా, ఫామ్‌హౌస్‌లోని పెంపుడు కుక్క చిరుతను చూసి మొరిగింది. దానితో అది తలపడింది. యజమాని సుభ్రాంశు భోల్ కుమారుడు కుక్క అరుపులకు అలెర్ట్ అయ్యాడు. దానిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిపై చిరుత దాడి చేసింది. దానితో పోరాడిన అతడు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ చిరుత మరణించింది.
మరోవైపు చిరుత దాడిలో గాయపడిన ఆ వ్యక్తి అక్కడున్న గదిలో దాకున్నాడు. తన తండ్రికి ఫోన్ చేశాడు. ఫార్మ్‌హౌస్ వద్దకు రావాలని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పాడు. తొలుత అతడికి ప్రాథమిక వైద్యం అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కటక్ ఆసుపత్రికి తరలించారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన చిరుతను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై సంయుక్త కమిటీతో దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.
Also Read:
Professor Stabbed At Station | రైల్వే స్టేషన్లో.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు
Skeleton In Luggage | లగేజీ బ్యాగ్‌లో అస్థిపంజరం.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
Watch: ప్రియుడిని పెట్టెలో దాచిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?