న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల లగేజీ బ్యాగులను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. ఒక వ్యక్తి లగేజీ బ్యాగ్‌లో మానవ అస్థిపంజరం ఉండటం చూసి షాక్ అయ్యారు. దానిని పరిశీలించగా వైద్య విద్యార్థులు వినియోగించే నమూనా అని తేలింది. (Skeleton In Luggage) ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన కలకలం రేపింది. గురువారం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ప్రమాణికుల లగేజ్‌ను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఒక వ్యక్తి బ్యాగ్‌లో మానవ అస్థిపంజరం వంటిది కనిపించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు.
కాగా, ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులు, పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బ్యాగ్‌లోని అస్థిపంజరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వైద్య విద్యార్థులు వినియోగించే మోడల్ స్కెలిటన్గా గుర్తించారు. ఆ వ్యక్తి వైద్య విద్యార్థి అని తెలుసుకున్నారు.
మరోవైపు ఇలాంటి డెమో అస్థిపంజరాలను మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య కోసం ఉపయోగిస్తారని పోలీస్ అధికారి తెలిపారు. అయినప్పటికీ మరింత నిర్ధారణ కోసం ఆ అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు చెప్పారు. అయితే ఈ సంఘటన వల్ల ఎయిర్‌పోర్ట్‌లోని ఆ టెర్మివల్ వద్ద కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
Also Read:
Diaper Saves Baby | పసిబిడ్డను బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్
Student Suicide In Classroom | ప్రైవేట్ కాలేజీ క్లాస్‌రూమ్‌లో.. విద్యార్థిని ఆత్మహత్య
Watch: బిజీ రోడ్డులో కారును అడ్డుకుని.. మహిళను కిడ్నాప్
Watch: భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తర్వాత ఏం చేసిందంటే?