రాయ్‌పూర్: తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను ఒక కోతి లాక్కెళ్లింది. ఆ శిశువును బావిలో పడేసింది. అయితే ఆ చిన్నారి నీటిలో మునిగిపోకుండా డైపర్ కాపాడింది. (Diaper Saves Baby) పది నిమిషాలు బావిలో ఉన్న ఆ పసిబిడ్డను గ్రామస్తులు బయటకు తీశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. జనవరి 21న సియోని గ్రామానికి చెందిన సునీత ఇంటి వరండాలో 20 రోజుల పసిబిడ్డకు పాలు ఇస్తున్నది.
కాగా, నాలుగైదు కోతులు అక్కడకు వచ్చాయి. తల్లి సునీత చేతిలో ఉన్న పసి పాపను ఒక కోతి లాక్కెళ్లింది. ఇంటిపైకి అది ఎక్కింది. ఆ కోతి చేతిలో ఉన్న బిడ్డను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కోతిని బెదరగొట్టేందుకు పటాకులు కాల్చారు. అయితే చేతిలో ఉన్న బిడ్డను పొరుగింటిలో ఉన్న బావిలో ఆ కోతి పడేసింది.
మరోవైపు ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ బావి వద్దకు పరుగులు తీశారు. పసి బాలికకు వేసిన డ్రైపర్ వల్ల నీటిపై తేలడాన్ని గమనించారు. బకెట్ల సహాయంతో ఆ పసిబిడ్డను బయటకు తీశారు. ఆ శిశువు కొద్దిగా నీటిని తాగడంతో అస్వస్థతకు గురైంది.

Diaper Saves Baby
అయితే అదృష్టవశాత్తు రాజేశ్వరి అనే నర్సు ఒక వేడుక కోసం ఆ గ్రామంలో ఉన్నది. బావి నుంచి బయటకు తీసిన ఆడ బిడ్డకు ఆమె వెంటనే సీపీఆర్ చేసింది. ఆ తర్వాత శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆ పసిపాపకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊరట చెందారు. బావిలో పడిన ఆ శిశువు నీటిలో మునిగిపోకుండా డైపర్ కాపాడినట్లు తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
Also Read:
contaminated water | కలుషిత తాగునీటి వల్ల.. ఇండోర్ జిల్లాలో 24 మందికి అస్వస్థత
Watch: బిజీ రోడ్డులో కారును అడ్డుకుని.. మహిళను కిడ్నాప్
Watch: జూనియర్లపై దాడి, ర్యాగింగ్.. 23 మంది సీనియర్ విద్యార్థులపై కేసు