Wine Shops | నర్సాపూర్, మార్చి 3 : హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లాలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. 1968 TG ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20(1) కింద శాంతిభద్రతల దృష్ట్యా హోలీ రోజున జిల్లాలో డ్రై డే ప్రకటించినట్లు పేర్కొన్నారు.
దీని ప్రకారం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశించారు. పండుగల పవిత్రతను కాపాడేందుకే వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేస్తున్నట్లుగా తెలిపారు. కొంతమంది తప్పతాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం, పరస్పరం దాడులు వంటివి పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.