భోపాల్: ప్రియుడితో కలిసి తల్లి ఉండటాన్ని ఆమె కుమారుడు చూశాడు. భర్తకు చెబుతాడన్న భయంతో కుమారుడ్ని బిల్డింగ్ పైనుంచి కిందకు తోసి హత్య చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆ మహిళకు జీవిత కారాగార శిక్ష విధించింది. ఆమె ప్రియుడ్ని నిర్దోషిగా ప్రకటించింది. (Mother Gets Life Term for Killing Son) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్ రాథోర్ భార్య జ్యోతి, పొరుగున నివసించే ఉదయ్ ఇండోలియా మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, 2023 ఏప్రిల్ 28న ఉదయ్‌తో అభ్యంతరకర స్థితిలో ఉన్న తల్లి జ్యోతిని ఐదేళ్ల కుమారుడు జతిన్ చూశాడు. తన భర్తకు చెబుతాడేమోనని ఆమె ఆందోళన చెందింది. కుమారుడ్ని రెండస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు చికిత్స పొందుతూ మరునాడు మరణించాడు.
మరోవైపు బాలుడు జతిన్ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయినట్లు తొలుత అంతా నమ్మారు. అయితే కుమారుడు కలలోకి రావడంతో 15 రోజుల తర్వాత తానే చంపినట్లు జ్యోతి పలుసార్లు భర్తకు చెప్పి ఏడ్చింది. ధ్యాన్ సింగ్ దీనిని రికార్డ్ చేశాడు. పొరుగు వ్యక్తి ఉదయ్‌తో భార్యకు సంబంధం ఉన్నట్లు తొలి నుంచి అనుమానించిన అతడు సీసీటీవీ ఆధారాలు సేకరించాడు.
కాగా, భార్య జ్యోతి, ఉదయ్ కలిసి తన కుమారుడ్ని హత్య చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ధ్యాన్ సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆధారాలు, సాక్ష్యాల మేరకు కొడుకును హత్య చేసిన తల్లి జ్యోతిని దోషిగా నిర్ధారించింది. ఆమెకు జీవిత ఖైదు విధించింది. ప్రియుడు ఉదయ్‌కు సంబంధించి తగిన ఆధారాలు లేకపోవడంతో అతడ్ని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.
Also Read:
Indore’s crorepati beggar | ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు.. మూడు బిల్డింగులు, కారు, ఆటోలు, వడ్డీ వ్యాపారం
Man Forced To Drink Urine | ప్రియురాలి వద్దకు వెళ్లిన యువకుడు.. కొట్టి, మూత్రం తాగించిన ఆమె కుటుంబం
Ladakh earthquake | లడఖ్‌లో భూకంపం.. లేహ్‌లో 5.7 తీవ్రతతో ప్రకంపనలు