చెన్నై: టాయిలెట్లో ఉన్న మహిళా పోలీస్ అధికారిణి వీడియోను ఒక పోలీస్ అధికారి రికార్డ్ చేశాడు. గమనించిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. (Cop Films Woman Colleague In Toilet) తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 17న సీఎం ఎంకే స్టాలిన్ ఆ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీస్ అధికారులు విధుల్లో ఉన్నారు.
కాగా, పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద తాత్కాలికంగా టాయిలెట్ ఏర్పాటు చేశారు. ఒక మహిళా పోలీస్ అధికారిణి ఆ టాయిలెట్లోకి వెళ్లగా అక్కడ ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. దీంతో ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళా పోలీస్ అధికారిణితో పాటు విధుల్లో ఉన్న సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఎస్ఐ) ముత్తుపాండియన్కు చెందిన మొబైల్ ఫోన్‌గా గుర్తించారు.
మరోవైపు ఆ మొబైల్ ఫోన్లో ఎలాంటి వీడియో రికార్డ్ లేదని పోలీసులు తెలిపారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. పూర్తి దర్యాప్తు తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అయితే ఈ సంఘటన తమిళనాడులో రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార డీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీ మండిపడ్డాయి. మహిళలను కాపాడాల్సిన పోలీసులే ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో శాంతి, భద్రతల అంశంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి.
Also Read:
Indore’s crorepati beggar | ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు.. మూడు బిల్డింగులు, కారు, ఆటోలు, వడ్డీ వ్యాపారం
Man Forced To Drink Urine | ప్రియురాలి వద్దకు వెళ్లిన యువకుడు.. కొట్టి, మూత్రం తాగించిన ఆమె కుటుంబం
Ladakh earthquake | లడఖ్‌లో భూకంపం.. లేహ్‌లో 5.7 తీవ్రతతో ప్రకంపనలు