భోపాల్: రోడ్డుపై అడుక్కునే బిచ్చగాడిని కోటీశ్వరుడుగా అధికారులు గుర్తించారు. భిక్షాటన ద్వారా అతడు కోట్లు సంపాదించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ బెగ్గర్‌కు మూడు బిల్డింగులు, ఖరీదైన కారు, ఆటోలు ఉన్నట్లు తెలుసుకున్నారు. (Indore’s crorepati beggar) వాటిని అద్దెకు ఇవ్వడంతోపాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భిక్షాటనను ప్రభుత్వం నిర్మూలించింది. ఈ నేపథ్యంలో నగరంలో అడుక్కునే వారిపై అధికారులు దృష్టిసారించారు. మంగీలాల్ అనే బిచ్చగాడు కోటీశ్వరుడిగా తెలుసుకుని షాక్ అయ్యారు. భిక్షాటన ద్వారా కోట్లాది రూపాయల సంపదను అతడు కూడబెట్టినట్లు తెలుసుకున్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంయుక్త చొరవలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని లబ్ధిగా మంగీలాల్ పొందాడు. అయినప్పటికీ ఇండోర్‌లోని రోడ్లపై చక్రాల చెక్క బల్లపై అడుక్కోవడం అతడు ఆపలేదు. మంగీలాల్‌కు మూడు సొంత ఇళ్లు ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఇండోర్‌లోని భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్‌లో మూడు అంతస్తుల భవనాలను అతడు అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు.

Indore Begger
మరోవైపు మంగీలాల్‌కు మారుతి సుజుకి డిజైర్ కారుతో పాటు మూడు ఆటోలు ఉన్నాయి. వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నాడు. అలాగే వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇండోర్‌లోని సరాఫా బజార్‌లోని చిరు వ్యాపారులు, ప్రజలకు అప్పులు ఇచ్చి రోజువారీ వడ్డీలు వసూలు చేస్తున్నాడు.
అయితే ఇండోర్‌లో భిక్షాటన నిషేధించినప్పటికీ మంగీలాల్ అడుక్కోవడం కొనసాగిస్తున్నట్లు అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో మహిళా, శిశు అభివృద్ధి అధికారుల బృందం అతడి గురించి ఆరా తీసింది. ఈ నేపథ్యంలో మంగీలాల్ కోటీశ్వరుడైన బిచ్చగాడని వెలుగులోకి వచ్చింది. భిక్షాటన కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అతడ్ని హెచ్చరించారు.
Also Read:
Ladakh earthquake | లడఖ్‌లో భూకంపం.. లేహ్‌లో 5.7 తీవ్రతతో ప్రకంపనలు
Man Forced To Drink Urine | ప్రియురాలి వద్దకు వెళ్లిన యువకుడు.. కొట్టి, మూత్రం తాగించిన ఆమె కుటుంబం
Watch: అమ్మకానికి పోలీస్ వాహనాలు.. ప్రకటన వీడియో చూసి పోలీసులు షాక్