Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ధ్రువీకరించిన ఇరాన్ మీడియా
ఇరాన్‌పై(Iran) అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా(West asia) నెత్తురోడుతోంది. వందలాది మంది అమాయకులు బలవుతున్నారు.
హైదరాబాద్ : ఇరాన్‌పై(Iran) అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా(West asia) నెత్తురోడుతోంది. వందలాది మంది అమాయకులు బలవుతున్నారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ(Khamenei) మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించనట్లు వివరాలను వెల్లడించింది. ఖమేనీ మృతి 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. కాగా, పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్‌తో అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం అనూహ్యంగా దాడికి దిగాయి. రాజధాని నగరం టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న 30 ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్షిపణి దాడులు జరిగాయి. దీంతో టెహ్రాన్ అంతటా పేలుడు శబ్దాలు వినిపించాయి.
దట్టమైన పొగ వ్యాపించింది. దక్షిణ ఇరాన్‌లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా దాడుల్లో 200 మంది మృతిచెందినట్టు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్, ఆ దేశ రక్షణ మంత్రి అమీర్ మరణించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తమ సైనిక చర్యను ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’గా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ దాడులను ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’గా ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

