హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్ట పరిచి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంక్‌కు చెందిన డిజిటల్-ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేశ్ ఉత్తమ్ చందానీ నేతృత్వంలోని బృందం సీఎస్‌తో భేటీ అయ్యింది.
మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డాటా సెంటర్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై విసృ్తతంగా చర్చించారు.