Asian Games : ఆసియా క్రీడల్లో జయభేరి మోగిస్తున్న భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశ నుంచి దుమ్మురేపిన టీమిండియా సెమీఫైనల్లో దక్షిణ కొరియాను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తద్వారా 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పసిడి పోరుకు సిద్ధమైంది భారత్. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఇషికా ఔదరీ, కెప్టెన్ సలీమా టెటె చెరో గోల్‌తో రాణించారు.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. తొలి రౌండ్ నుంచి అదరగొట్టిన టీమిండియా బుధవారం సెమీఫైనల్లో దక్షిణా కొరియాను నిలువరించింది. పటిష్టమైన కొరియాపై 2-0తో గెలుపొందిన భారత్.. 44 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది.
𝗜𝗡𝗗𝗜𝗔 𝗔𝗥𝗘 𝗜𝗡 𝗧𝗛𝗘 𝗙𝗜𝗡𝗔𝗟! 🇮🇳🔥
The Indian Women’s Team beats South Korea 2-0 in the second semi-final of Asian Games 2026 to book their place in the gold medal match! 🏑💪
China await in the final on October 2. One last battle for gold. 🇮🇳🏆#HockeyIndia… pic.twitter.com/lAb0o7MnZL
— Hockey India (@TheHockeyIndia) September 30, 2026
చివరగా 1982లో ఢిల్లీ వేదికగా జరిగిన క్రీడల్లో పసిడి పతకం సాధించింది మహిళల జట్టు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సలీమా టెటె సారథ్యంలోని భారత బృందం సంచలన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. బుధవారం దక్షిణ కొరియాపై ఇషికా చౌదరీ 44వ నిమిషంలో.. కెప్టెన్ సలీమ 48వ నిమిషంలో గోల్ చేయగా.. ఉమెన్ ఇన్ సాఫ్ఫ్రాన్ దర్జాగా ఫైనల్ చేరింది. స్వర్ణం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను టీమిండయా ఢీకొట్టనుంది.