– డీపీవో అనూష, జడ్పీ సీఈవో నాగలక్ష్మి
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30 : సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు కృషి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి అనూష, జడ్పీ సీఈవో నాగలక్ష్మి తెలిపారు. బుధవారం మేజర్ పంచాయతీ సారపాకలో సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ ఆధ్వర్యంలో ఐటీసీ సహకారంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సఫాయి మిత్ర సురక్షా ఏవం సమ్మాన్ శివిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా మోరంపల్లిబంజర్ పీహెచ్సీ వైద్యుడు నగేష్ వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన డీపీవో, జడ్పీ సీఈవో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం, శుభ్రమైన సమాజం కోసం పారిశుధ్య కార్మికులకు పని చేస్తున్నట్లు తెలిపారు.
అలాంటి వారి ఆరోగ్యం కాపాడడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. అనంతరం సఫాయి కార్మికులకు భద్రతా సామగ్రి పరికరాలు అందించి ఇన్సూరెన్స్ చేయించారు. అనంతరం వారిని గౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, ఐటీసీ యూనిట్ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, పంచాయతీ ఈవో గుగులోత్ రవికుమార్, ఎంపీవో రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఐటీసీ ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

‘పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు కృషి’