రామాయంపేట, ఆగస్టు 3: మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ రహదారి బై పాస్ వద్ద సోమవారం విద్యార్థులు, టీచర్లు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి లా రీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటిపల్లిలోని కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన 14 విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఆటోడ్రైవర్ మొత్తం 17 మందితో కూడిన ఆటో రామాయంపేటకు వస్తుండగా, మార్గమధ్యలోని జాతీ య రహదారిపై బైపాస్ ప్రాంతంలో కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆటో ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు స్మృతిక, లావణ్య, శివచరణ్, ముఖేష్‌గౌడ్, దీపిక, టీచర్లు మం జుల, జ్యోతి, ఆటో డ్రైవర్ నవీన్‌కు తీవ్రం గా గాయపడ్డారు. ఐదుగురు విద్యార్థులకు, టీచర్లకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి, హైదరాబాద్‌కు అంబులెన్సుల్లో తరలించారు.
మిగతా ఏడుగురు విద్యార్థులకు రామాయంపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నా రు. క్షతగాత్రులను రామాయంపేట సీఐ సైదానాయక్, ఎస్సై బాలరాజు తమ సి బ్బందితో దవాఖానకు చేర్చి, వైద్యం చేయించారు. రామాయంపేట దవాఖాన వద్దకు విద్యార్థుల కుటుంబీకులు చేరుకుని రోదించారు. రోజూ వచ్చే ఆర్టీసీ బస్సు సో మవారం రాకపోవడంతో విద్యార్థులు ఆటోలో వస్తూ ప్రమాదానికి గురయ్యారని వారి కుటుంబీకులు వాపోయారు. రోజు బస్సు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. రామాయంపేట ప్రభు త్వ దవాఖానలో క్షతగాత్రులను తహసీల్దార్ రజినీకుమారి, కౌన్సిలర్లు చౌదరి చరిత, రంజిత్, బీఆర్ఎస్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు తదితరులు పరామర్శించారు. రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేటలో జాతీయ రహదారిపై తక్షణమే ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడి డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆమె వైద్యులు, పోలీసులకు ఫోన్లు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఫ్లై ఓవర్ నిర్మించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టామని, హైదరాబాద్‌కు వెళ్లి సంబంధిత ఆధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నా రు. ఇంకెన్ని రోడ్డు ప్రమాదాలు జరగాలని, తక్షణమే రామాయంపేట బైపాస్ వద్ద ప్రమాదాలు జరగకుండా ఫ్లెఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.