పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో అమన్ చాంపియన్‌గా నిలిచాడు. గత ఆసియాడ్‌లో సాధించిన కాంస్యాన్ని ఈసారి పసిడిగా మార్చుకున్నాడు. ఫైనల్లో అమన్ 11-7తో ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ చాంపియన్ చోంగ్ సాంగ్ హాన్‌ను ఓడించి ఔరా అనిపించాడు. మహిళల 53 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సరసన నిలవాలని ఆశించిన అంతిమ్ ఆశ నెరవేరలేదు.
ఫైనల్లో 1-9తో జపాన్ రెజ్లర్, వరల్డ్ చాంపియన్ మోయ్ మియోకా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల 97 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దీపక్ పునియా 2-1తో గాన్బాటార్ (మంగోలియా)పై నెగ్గాడు. కాగా, సాగర్ జగ్లాన్ (74 కేజీలు), మనీషా భన్వాలా (57 కేజీలు) నిరాశపరిచారు.ఈ ఆసియాడ్‌లో భారత రెజ్లర్లు రెండేసి స్వర్ణాలు, రజతాలు, కాంస్యాలతో ఆరు పతకాలు అందుకున్నారు.