లేహ్: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో సోమవారం భూకంపం సంభవించింది. 5.7 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు లేహ్‌ను కుదిపేశాయి. (Ladakh earthquake) ఉదయం 11:51 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది. కార్గిల్‌కు వాయువ్య దిశలో 290 కిలోమీటర్ల దూరంలో, 171 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.
కాగా, లడఖ్‌లోని లేహ్‌తో పాటు జమ్ముకశ్మీర్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), భారత్‌కు ఉత్తరాన ఉన్న పొరుగు దేశాల సమీప ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ఎన్సీఎస్ వివరించింది. మధ్య ఆసియాలోని తజికిస్థాన్ వరకు భూ ప్రకంపనలు వ్యాపించినట్లు వెల్లడించింది.
మరోవైపు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. లడఖ్‌లోని లేహ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉండటంతో లేహ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read:
Man Forced To Drink Urine | ప్రియురాలి వద్దకు వెళ్లిన యువకుడు.. కొట్టి, మూత్రం తాగించిన ఆమె కుటుంబం
2 wives man kills live-in partner | ఇద్దరు భార్యలున్న వ్యక్తి.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య
Woman Dies By Suicide | భర్త మొబైల్ ఫోన్ కొనివ్వలేదని.. భార్య ఆత్మహత్య