Vishwak Sen | టాలీవుడ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్ (Vishwak sen). విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘కల్ట్’ (CULT). గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు.
ఈ క్రేజీ యాక్టర్ ఇటీవలే ‘ఫంకీ’సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే.. జాతిరత్నాలు ఫేం కేవీ అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈవెంట్లో విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఫంకీ హిట్టయింది. దాని గురించి ఇతరులు ఏం చెప్పినా నేను పట్టించుకోనన్నాడు విశ్వక్ సేన్. కల్ట్ గురించి మాట్లాడుతూ.. నేను గొప్ప సినిమా తీశానని.. అది ఎంతమందిని రీచ్ అవుతుందో చూడాలన్నాడు. ఈ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
కల్ట్ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు. సందీప్ కాకర్ల, కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’ సినిమాల తర్వాత విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.