Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. తానే కాదు, తనతో పని చేసే వాళ్లందరికీ మంచి భోజనం పెట్టాలని భావించే స్టార్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది నటీనటులు “ప్రభాస్‌తో సినిమా అంటే క్యారేజీలు ఇంటికే వస్తాయి” అని ఇప్పటికే చెప్పడం మనం చూశాం. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌తో హీరో సంతోష్ శోభన్ సరదాగా మాట్లాడాడు. “అన్నా… మీరు వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసి ఫుడ్ తెప్పిస్తారట నిజమేనా?” అని అడిగాడు. దానికి ప్రభాస్ నవ్వుతూ స్పందిస్తూ, “అందరూ నా ఫుడ్ మీదే పడతారేంటి? అవును, కొన్నిసార్లు వేరే స్టేట్ నుంచి తెప్పిస్తుంటాను” అని చెప్పారు.
ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనను ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. “ఏం తిందాం?” అన్న చర్చలో ‘మీ ముంబై ఫుడ్ కాదు, చెన్నై ఫుడ్ తెప్పిస్తాను’ అన్నాను. అందరూ ఓకే అన్నారు. రాత్రి 9 అయ్యింది, 10 అయ్యింది… ఫుడ్ ఇంకా రాలేదని దర్శకుడు ఓం రౌత్ అడుగుతూ ఉన్నాడు. నేను ‘చెన్నై నుంచి రావాలి కదా, టైమ్ పడుతుంది’ అన్నాను. చెన్నై నుంచి ఫుడ్ వస్తుందా? అని షాక్ అయ్యాడు. హాట్ బాక్సుల్లో పెట్టుకుని ఫ్లైట్‌లో వస్తుంది అన్నాను” అని ప్రభాస్ చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత నిజంగానే చెన్నై నుంచి ఫుడ్ ముంబైకి చేరింది. “నువ్వు మామూలోడు కాదయ్యా బాబు” అని ఓంరౌత్ అన్నాడని ప్రభాస్ నవ్వుతూ చెప్పారు. “చెన్నై ఫుడ్ మిస్ అయితే అప్పుడప్పుడూ ఇలా తెప్పిస్తుంటాను” అని తెలిపారు.
ప్రభాస్ తన ఖర్చుతో చెన్నై నుంచి ముంబైకి ఫుడ్ తెప్పించాడన్న విషయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. కారణం ‘ఆదిపురుష్’ సినిమా ఫలితం. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. విజువల్స్, పాత్రల రూపకల్పన, డైలాగులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రామాయణానికి అనవసర కల్పితాలను జోడించారని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో “అంత ఫుడ్ పెట్టినా, సినిమా మాత్రం ఎందుకిలా తీశారు?” అంటూ కొందరు నెటిజన్లు ఓంరౌత్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి, ప్రభాస్ ఫుడ్ లవ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఉదార స్వభావం అభిమానులను ఆకట్టుకుంటుండగా, ‘ఆదిపురుష్’ జ్ఞాపకాలు మాత్రం ఇంకా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే ఉన్నాయి.