Anakapalli | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ యాక్టర్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట కాంబోలో వస్తోన్న సినిమా ‘అనకాపల్లి’ (Anakapalli). ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 7న సినిమా విడుదల కాబోతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. రియల్ హీరోగా పాపులర్ అయిన పాపులర్ యాక్టర్ సోనూసూద్ మూవీలో ‘డర్టీ గ్యాంగ్‌స్టర్’ సాంగ్ లాంచ్ చేశాడు. కేకే రచించిన ఈ పాటను పృథ్వి చంద్ర, ఈకే పాడారు.
మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సాగుతున్న ఈ పాట సినిమాపై హైప్ పెంచేస్తుంది. డర్టీ గ్యాంగ్‌స్టర్ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న సోనూసూద్ అనకాపల్లికి సపోర్ట్ ఇస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో త్రినాథరావు నక్కిన, ఇంద్రజ కనిపించబోతున్నారని మధ్యతరగతి తల్లిదండ్రులుగా కనిపించనున్నారు.
అనకాపల్లిలో ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తుండగా.. డావ్జాండ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో కీ రోల్లో కూడా నటిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
డర్టీ గ్యాంగ్‌స్టర్ సాంగ్..
A Power-Packed Launch by @SonuSood ! 💥
The much-awaited #DirtyGangsters song from #Anakapalli is Out Nowhttps://t.co/RvkPy3xfS2@TrinadharaoNak1 #VikramSahidev #SandhyaVasishta @tarakponnappa #Indraja @sangeethaoffi @Khageshdirector #NaiduKandregula @actorbhasha… pic.twitter.com/0eU9M0mV5I
— BA Raju’s Team (@baraju_SuperHit) August 2, 2026