Cold | వర్షాకాలంలో వచ్చే సాధారణ దగ్గు, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..
వర్షాకాలం ప్రారంభమైన వెంటనే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్ల బారిన సులభంగా పడతారు.
Cold | వర్షాకాలం ప్రారంభమైన వెంటనే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్ల బారిన సులభంగా పడతారు. ఫ్లూ వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే కొన్ని సహజ ఆహార పదార్థాలు జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడంలో కొంతవరకు సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల జలుబు, ఫ్లూ సమయంలో ఇది సహజ ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లిని చిన్న ముక్కలుగా తరిగి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే ముక్కు దిబ్బడ తగ్గడంతోపాటు కఫం బయటకు రావడంలో కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయ, కొబ్బరినూనె..
ఉల్లిపాయలో శక్తివంతమైన సహజ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల జలుబుతో వచ్చే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శ్వాసనాళాలు తెరుచుకునేలా చేసి ఊపిరితిత్తుల్లోని దిబ్బడను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఉల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి తీవ్రమైన దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా టీలో ఉల్లిరసం వేసుకుని తాగడం వల్ల గొంతుకు ఉపశమనం కలిగి జలుబు సమయంలో సౌకర్యంగా అనిపిస్తుంది. కొబ్బరి నూనె కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో కొంత మేర తోడ్పడతాయి. రోజువారీ ఆహారంలో కొద్దిపాటి మోతాదులో దీనిని ఉపయోగించవచ్చు.
తేనె..
తీవ్రమైన దగ్గు ఉన్నప్పుడు తేనె తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒక టీస్పూన్ ఉల్లి రసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకుంటే గొంతు మంట, దగ్గు నుంచి మరింత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అయితే జలుబు, దగ్గు లక్షణాలు ఎక్కువ రోజుల పాటు కొనసాగినా, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపించినా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

