NZ vs PAK | తొలి సూపర్ 8 మ్యాచ్ రద్దు.. షాక్‌లో పాక్, న్యూజిలాండ్..!
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 ఆరంభ పోరులో విజయంపై కన్నేసిన పాకిస్థాన్ (Pakistan), న్యూజిలాండ్ (Newzealand)కు బిగ్ షాక్. వర్షం కారణంగా మ్యాచ్ ఒక్కబంతి కూడా పడకుండానే రద్దయ్యింది.
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 ఆరంభ పోరులో విజయంపై కన్నేసిన పాకిస్థాన్(Pakistan), న్యూజిలాండ్ (Newzealand)కు బిగ్ షాక్. వర్షం కారణంగా మ్యాచ్ ఒక్కబంతి కూడా పడకుండానే రద్దయ్యింది. టాస్ పడడమే ఆలస్యం ప్రేమదాస స్టేడియాన్ని ముంచెత్తిన వర్షం.. ఎంతకూ తగ్గలేదు. కనీసం ఐదు ఓవర్ల ఆటైనా జరిపించాలనుకున్నా సాధ్యపడలేదు. వర్షం బ్రేకివ్వకపోవడంతో నాలుగ్గంటలే వేచిచూసిన అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు.
లీగ్ దశలో ఒక ఓటమితో గ్రూప్ బీలో చోటు దక్కించుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల జట్లకు వర్షం ఊహించని షాకిచ్చింది. శనివారం ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో.. విజయంతో రెండు పాయింట్లు సాధించాలనుకున్న ఇరుజట్లకు అంపైర్లు చెరొక పాయింట్ కేటాయించారు. ఊహించిని పరిణామంతో పాక్, కివీస్ ఆటగాళ్లు కంగుతిన్నారు.
The rain has the final say in Colombo 🙁 pic.twitter.com/zXCnXXVvpa
— ESPNcricinfo (@ESPNcricinfo) February 21, 2026
టాస్ పడగానే..
ప్రపంచకప్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడడం ఇది రెండోసారి. లీగ్ దశలో గ్రూప్ బీలోని ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్‌ను అడ్డుకున్న వరుణుడు.. చివరకు ఆస్ట్రేలియా నిష్క్రమించడానికి కారణమయ్యాడు. ఈసారి సూపర్ 8లో మొదటి మ్యాచ్‌కే అంతరాయం కలిగిస్తున్నాడు. ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్న కాసేపటికే.. చినుకులు షురూ అయ్యాయి. సాయంత్రం 6:30 గంటలకు ముందు నుంచే అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండడంతో అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వర్షం మొదలవ్వగానే కవర్లతో పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను పూర్తిగా కప్పేశారు.
New Zealand and Pakistan share points after rain has the final say in the first #T20WorldCup Super 8 contest.
📝: https://t.co/IDrbJnSgnW pic.twitter.com/z25oocbEly
— ICC (@ICC) February 21, 2026
రెండు మ్యాచులు కీలకం
తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో తదుపరి రెండు మ్యాచులు ఇరుజట్లకు కీలకం కానున్నాయి. ఫిబ్రవరి 24న పాకిస్థాన్ పల్లెకెలె స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 28 ఆతిథ్య శ్రీలంకతో పల్లెకెల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు పాక్ తలపడనుంది. న్యూజిలాండ్ తమ రెండో మ్యాచ్‌లో ఫిబ్రవరి 25న ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు శ్రీలంకతో కొలంబోతలపడుతుంది. ఫిబ్రవరి 27న ఇదే మైదానంలో ఇంగ్లండ్, బ్లాక్ క్యాప్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

