జైపూర్: ఒక యువకుడు ప్రియురాలి గ్రామానికి వెళ్లాడు. ఆమె కుటుంబం అతడ్ని కిడ్నాప్ చేసింది. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసింది. ఆ యువకుడ్ని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. ఈ వీడియో క్లిప్‌ను ఆ వ్యక్తి కుటుంబానికి పంపారు. (Man Forced To Drink Urine) రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ జిల్లాలోని పులోరో గ్రామానికి చెందిన ఒక యువతి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాలోని కోలార్‌కు చెందిన 18 ఏళ్ల సోను మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది.
కాగా, 15 రోజుల కిందట ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భోపాల్ చేరుకుని ప్రియుడ్ని కలుసుకున్నది. సోనుతో కలిసి కొన్ని రోజులు ఉన్నది. ఆమె కుటుంబం జోక్యం వల్ల తిరిగి రాజస్థాన్ వెళ్లింది. ఆ తర్వాత తన వద్దకు రావాలంటూ సోనుకు ఫోన్ చేసింది. దీంతో ప్రియురాలిని కలిసేందుకు రాజస్థాన్‌లోని పులోరో గ్రామానికి అతడు చేరుకున్నాడు.
మరోవైపు సోను ఆ గ్రామానికి చేరగానే యువతి కుటుంబ సభ్యులు అతడ్ని కిడ్నాప్ చేశారు. ఒక గదిలో బంధించారు. కొన్ని గంటలపాటు దారుణంగా కొట్టి హింసించారు. బీరు బాటిల్లో నింపిన మూత్రాన్ని బలవంతంగా తాగించారు. ఈ చిత్రహింసలను వీడియో రికార్డ్ చేసి సోను కుటుంబానికి పంపారు.
అయితే ఈ వీడియో చూసి సోను కుటుంబం షాక్ అయ్యింది. అతడి పరిస్థితిపై ఆందోళన చెందింది. వెంటనే కోలార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక పోలీస్ బృందం రాజస్థాన్ వెళ్లింది. ఆ రాష్ట్ర పోలీసుల సహాయంతో సోనును కాపాడారు. అతడ్ని కొట్టి బలవంతంగా మూత్రం తాగించిన యువతి కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | विवाहित प्रेमिका के बुलावे पर Bhopal से 259 km दूर पहुंचा नाबालिग- लोगों ने बंधक बनाकर पिलाया पेशाब
.
.
.
.#RajasthanCrime #LoveStoryTragedy #BhopalYouth #SonuCase #CrimeVideo pic.twitter.com/4NgZuMyi0r— Republic Bharat – रिपब्लिक भारत (@Republic_Bharat) January 19, 2026
Also Read:
2 wives man kills live-in partner | ఇద్దరు భార్యలున్న వ్యక్తి.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య
Woman Dies By Suicide | భర్త మొబైల్ ఫోన్ కొనివ్వలేదని.. భార్య ఆత్మహత్య
Boy Takes Mother’s Body To morgue | ఎయిడ్స్‌తో తల్లి మృతి.. 8 ఏళ్ల ఒంటరి కుమారుడు ఏం చేశాడంటే?