లక్నో: ఎయిడ్స్‌తో బాధపడుతున్న మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో 8 ఏళ్ల కుమారుడు ఒక్కడే ఆమె వద్ద ఉన్నాడు. పోస్ట్‌మార్టం కోసం తల్లి మృతదేహాన్ని మార్చురీ వద్దకు తీసుకెళ్లాడు. (Boy Takes Mother’s Body To morgue) ఆ బాలుడు ఒంటరిగా ఏడుస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమ సహాయాన్ని అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎయిడ్స్ సోకడంతో ఎనిమిది నెలల కిందట సురేంద్ర అనే వ్యక్తి మరణించాడు. 40 ఏళ్ల భార్య నీలం కూడా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నది. ఫరూఖాబాద్‌లోని పుట్టింట్లో ఉంటూ చికిత్స పొందింది. 15 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, నీలం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో నగ్లా ధీరజ్ గ్రామానికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఎటా మెడికల్ కాలేజీలో ఆమెను చేర్పించారు. చికిత్స పొందుతూ జనవరి 15న ఆమె మరణించింది. ఆ సమయంలో ఎనిమిదేళ్ల కుమారుడు శాని ఒక్కడే తల్లి వద్ద ఉన్నాడు. వైద్య సిబ్బంది సూచనతో పోస్ట్‌మార్టం కోసం తల్లి మృతదేహాన్ని మార్చురీ వద్దకు తీసుకెళ్లాడు. తాను ఒంటరిగా ఉన్నానని, తల్లిని తానే స్వయంగా తీసుకువచ్చినట్లు చెప్పి ఏడ్చాడు. భూ వివాదం కారణంగా మామల నుంచి తనకు హాని ఉన్నదని ఆరోపించాడు.
మరోవైపు ఆసుపత్రి సిబ్బంది ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఒంటరిగా ఏడుస్తున్న ఆ బాలుడ్ని ఓదార్చారు. అతడి నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. దగ్గరుండి పోస్ట్‌మార్టం ఏర్పాట్లు చూశారు. అనంతరం ఆ మహిళ అంత్యక్రియలను కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు జరిపించారు. ఆ బాలుడి భద్రతకు భరోసా ఇచ్చారు.
Also Read:
Man Murders Wife | భార్యను హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి
Watch: పేలిన ట్రాన్స్ఫార్మర్.. వ్యక్తికి అంటుకున్న మంటలు