లక్నో: ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత కొన్ని గంటలు బయట గడిపాడు. చివరకు ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. భార్యను చంపినట్లు చెప్పి లొంగిపోయాడు. (Man Murders Wife) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని మోహన్పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. ఇళ్ల నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. అక్కడ ఒక ఫ్యాక్టరీలో సచిన్ పనిచేశాడు.
కాగా, నెల కిందట ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు ఆ జంట చేరుకున్నది. ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సచిన్ ఆటో నడుపుతున్నాడు. అయితే భార్య శ్వేత బ్యాంకు ఖాతాలో తరచుగా డబ్బులు పడటాన్ని సచిన్ గమనించాడు. ఆమెను నిలదీయగా తన అమ్మమ్మ పంపుతున్నట్లు చెప్పింది.
మరోవైపు సమీపంలో నివసించే విద్యార్థులతో భార్యకు సంబంధం ఉన్నదని సచిన్ అనుమానించాడు. నిర్ధారణ కోసం జనవరి 16న ప్లాన్ వేశాడు. స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నానని, ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు.
అయితే కొంత సమయం తర్వాత సచిన్ ఇంటికి చేరుకున్నాడు. పొరుగున నివసించే ఇద్దరు యువకులు భార్యతో కలిసి తన ఇంట్లో ఉండటం అతడు చూశాడు. వారితో గొడవ పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గొడవ పడవద్దని చెప్పి పంపించివేశారు.
కాగా, పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్, శ్వేత మధ్య వాగ్వాదం పెరిగింది. ఆ యువకులతో తాను ఉంటానని భార్య చెప్పడంతో అతడు ఆగ్రహించాడు. శ్వేత గొంతు నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత కొంతసేపు బయట గడిపాడు. చివరకు ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. భార్యను చంపినట్లు చెప్పి లొంగిపోయాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. శ్వేత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సచిన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
AIMIM Big Win | మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఏఐఎంఐఎం సత్తా.. 125 స్థానాల్లో గెలుపు
Watch: పేలిన ట్రాన్స్ఫార్మర్.. వ్యక్తికి అంటుకున్న మంటలు