లక్నో: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఒక వ్యక్తికి మంటలు అంటున్నాయి. దీంతో భయంతో అతడు పరుగులు తీశాడు. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Transformer Blast) ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆజాద్ విహార్ కాలనీలోని కవితా ప్యాలెస్ సినిమా హాల్ సమీపంలో మినీ ట్రాన్స్ఫార్మర్ పేలింది. అందులోని వేడి ఆయిల్ రోడ్డుపైకి వెదజల్లింది. ఒక వ్యక్తి తలకు మంటలంటుకున్నాయి. దీంతో ప్రాణ భయంతో అతడు పరుగెత్తాడు. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. మంటలను ఆర్పి అతడ్ని కాపాడారు.
కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలిన సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులకు కూడా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఆలస్యంగా అక్కడకు చేరుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ పేలడంపై దర్యాప్తు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. అయితే మంటలు అంటుకున్న వ్యక్తి పరుగెత్తిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
⚠️ Trigger Warning : Disturbing Video⚠️
यूपी | गाजियाबाद में तेज धमाके से ट्रांसफार्मर फटा, शरीर में आग लगने पर एक शख्स भागता नजर आया !! pic.twitter.com/dXOixyO79S
— Sachin Gupta (@SachinGuptaUP) January 17, 2026
Also Read:
AIMIM Big Win | మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఏఐఎంఐఎం సత్తా.. 125 స్థానాల్లో గెలుపు
Russian Man Kills Two Women | గోవాలో రష్యా వ్యక్తి దారుణం.. ప్రియురాలు, స్నేహితురాలిని హత్య
Watch: పురుషుల వేషం వేసి.. ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళలు