వికారాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారీ నియమితులయ్యారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను గురువారం ప్రభుత్వం వికారాబాద్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండేండ్లపాటు కలెక్టర్‌గా పనిచేసిన ప్రతీక్ జైన్ నారాయణపేట జిల్లాకు బదిలీ అయ్యారు. దీపక్ తివారీ సెలవుల్లో ఉన్న దృష్ట్యా రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి ఇన్చార్జి కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు గత రెండేండ్లుగా ఇన్చార్జి అధికారితో కొనసాగుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టులో ఎట్టకేలకు కొత్తవారిని నియమించింది. తాండూరు సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న ఉమాశంకర్ప్రసాద్ను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.